Advertisements

లింగాలవలస పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం

లింగాలవలస పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం

వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు

కార్లో ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి

మృతుడి కొడుకు, కోడలకు తీవ్ర గాయాలు

వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం గతంలో పోలిపల్లి వద్ద నలుగురు మృతి చెందిన పెట్రోల్ బంక్ ఎదురుగానే ఈ ప్రమాదం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు వెళుతుండగా కొడుకు డ్రైవింగ్ చేస్తుండగా ఏం జరిగిందో తెలియదు గానీ వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కొడుకు కోడలి కి గాయాలు కాగా తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. సిఐ ప్రభాకర్ రావు, ఎస్సై సూర్య కుమారి, సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాన్ని వెలికి తీసారు. చెన్నైకి చెందిన ఓకే కుటుంబానికి చెందిన వీరంతా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలంగం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Leave a Comment