
*గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైయస్ఆర్సీపీ కార్యాలయం నందు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చేపట్టదలచిన “పోరు బాట”కార్యక్రమ పోస్టర్ ను ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానికసంస్థల ఎమెల్సీ,గూడూరు నియోజకవర్గ ఇంఛార్జ్ మేరిగ.మరళీధర్ గారు మరియు పార్టీ నాయకులు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సంధర్భంగా మేరిగ మురళీధర్ గారు మాట్లాడుతూ రేపు అనగా 27.12.2024 తేదీ ఉదయం 10 గం|| లకు స్థానిక కూరగాయల మార్కెట్ (DNR కమ్యునిటీ హాలు) పక్కన ఉన్న కరెంట్ A.E ఆఫీనందు ధర్నా మరియు కరెంటు ఛార్జీల తగ్గింపునకు సంబంధిత అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు.కావున ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నారు.