Advertisements

శ్రీసిటీని సందర్శించిన డిపిఐఐటి కార్యదర్శివ్యాపార అనుకూల వాతావరణం పట్ల ప్రశంస

శ్రీసిటీని సందర్శించిన డిపిఐఐటి కార్యదర్శివ్యాపార అనుకూల వాతావరణం పట్ల ప్రశంస

    శ్రీసిటీ, డిసెంబర్ 26, 2024:

    కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా, ఐఏఎస్, శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రపంచ-స్థాయి మౌళిక సదుపాయాలు, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. ప్రముఖ ఆటోమోటివ్, ఎయిర్ కండీషనర్ బ్రాండ్ల ఉనికి, బలమైన సరఫరా గొలుసుతో దేశంలో అగ్రగామి కేంద్రంగా శ్రీసిటీ వేగంగా ఎదుగుతోందని చెప్పారు.

    పారిశ్రామికవాడలో పర్యటించిన ఆయన డైకిన్ ఏసీ తయారీ పరిశ్రమను సందర్శించి అక్కడి తయారీ కార్యకలాపాలను పరిశీలించారు. శ్రీసిటీలో ఏసీ కంప్రెసర్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం డైకిన్ ఇండియా, తైవాన్ కు చెందిన రెచి సంస్థల భాగస్వామ్యంపై స్పందిస్తూ, ‘కీలకమైన విడిభాగాల కోసం భారతదేశం దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించే చర్యగా’ దానిని పేర్కొన్నారు.

    శ్రీసిటీ అద్భుత పారిశ్రామిక మౌళిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని అమర్‌దీప్ సింగ్ ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ చొరవకు శ్రీసిటీ ఒక చక్కని ఉదాహరణగా అభివర్ణించారు. జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, మరియు నిర్దిష్ట పర్యావరణ ప్రమాణాల ప్రాతిపదికపై రూపొందించబడ్డ శ్రీసిటీ అనుసరిస్తున్న వ్యాపార స్నేహపూర్వక విధానాలను ఆయన అభినందించారు.

    అమర్‌దీప్ సింగ్ పర్యటన తమకు ఎంతో ముఖ్యమైనదంటూ తన సందేశంలో పేర్కొన్న శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఆయన పరిశీలనలు, సూచనలు, శ్రీసిటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు.

    Leave a Comment