ప్రధానిగా వాజ్ పేయి సేవలు దేశానికి ఆదర్శనీయం
బిజెపి అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు
దివంగత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి భారతదేశ పరిపాలనలో ప్రపంచానికి దిక్సూచి అయ్యారని గూడూరు అర్బన్ మండల పార్టీ బిజెపి అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు పేర్కొన్నారు. బుధవారం గూడూరు రెండో పట్టణంలోని బాలసదనం హాస్టల్లో చిన్నారుల మధ్య మాజీ ప్రధాని, బిజెపి నాయకులు వాజ్ పేయి శతజయంతి వేడుకలను బిజెపి గూడూరు అర్బన్ మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్ధినులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గమనంలో నవసకానికి నాంది పలికిన వ్యక్తి వాజ్ పేయి అన్నారు. దేశంలో సుపరిపాలనకు నిజమైన భాష్యం చెప్పిన వ్యక్తి మాజీ ప్రధాని వాజ్పేయి అని కీర్తించారు. ప్రధానిగా ఒక్క ఓటుతో అధికారం వదులుకున్నా పార్టీ అభివృద్ధికి వెనుకాడని వ్యక్తి అన్నారు. తిరిగి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రధానిగా అధికారం చేపట్టి పరిపాలనలో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నిలబెట్టారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వాజపేయి ఆశయాలను అనుసరిస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా భారతదేశంలో దీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి రెండుసార్లు ప్రధానిగా అధికారం చేపట్టి మూడో సారి కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని తెలిపారు.ఇంకా అనేక మంది బిజెపి నాయుకులు మాజీ ప్రధాని సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయుకులు దయాకర్,జి వి నాయుడు,గాలి ప్రకాష్ నాయుడు, గుమ్మడి శ్రీనివాసులు, బాలకృష్ణ గౌడ్,కటికాల సురేష్,నిరంజన్,శివ, నాగూర్, బాలసాదనం వసతి గృహ సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.