Advertisements

గాయత్రి స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం


ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాసరామానుజన్ జయంతి మ్యాథ్స్ డే సందర్భంగా
శ్రీ గాయత్రి EM హైస్కూల్ నందు మ్యాథ్స్ ఎక్స్‌పో నిర్వహించడమైనది. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి కలిగించడం, పరిశోధనలు వైపు ప్రోత్స హించడమే లక్ష్యంగా శ్రీ గాయత్రి EM హైస్కూల్ యజమాన్యం మ్యాథ్స్ ఎక్స్‌పో నిర్వహించడం అభినందనీయమని నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ మ్యాథ్స్ HOD డాక్టర్ కళ్యాణ్ కుమార్ కొనియాడారు.అనంతరo మ్యాథ్స్ సీనియర్ ఉపాధ్యాయులు అయిన గురుగుహ , సాయి సురేష్ బాబు, కోదండరామ్ గార్లను మ్యాథ్స్ డే సందర్భంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో విద్యార్థులు 100 పైగా గణిత నమూనాలు ప్రదర్శించారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమం లో శ్రీ గాయత్రి EM హైస్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, గణిత ఉపాధ్యాయులు రఫీ, ధన శ్రీ, మరియు అకడమిక్ అడ్వైసర్ శ్రీహరిబాబు, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ సోనియా,ఉపాధ్యాయులు మస్తాన్బీ, సుప్రజ, హరిత,యామిని,సుప్రియ, వీర రాఘవయ్య ,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు .

Leave a Comment

You May Like This