Advertisements

నా క్యారెక్టర్ అలాంటిది కాదు – అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ : అల్లు అర్జున్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై అల్లు అర్జున్ స్పందించారు. అవన్నీ తన క్యారెక్టర్ కించపరిచేలా ఉన్నాయని.. వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని తాను అలాంటి వాడిని కాదని చెప్పుకున్నారు. మొత్తంగా వారి ఆరోపణలకే వివరణ ఇచ్చినప్పటికీ ప్రెస్ మీట్ మొత్తం మీద ఎవరి పేర్లను ఆయన ప్రస్తావించలేదు. తనపై జరుగుతున్న ప్రచారం అంతా ఫాల్స్ అని తాను ఎంతో మంచివాడినని చెప్పుకోవడానికి ఆయన పదే పదే ప్రయత్నించారు.

ధియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లడం ఎందుకో వివరణ ఇచ్చారు. పోలీసులే ట్రాఫిక్ క్లియర్ చేశారని అంటే అనుమతి ఉందని చెప్పుకొచ్చారు. తొక్కిసలాట జరిగిందని తెలియదని.. చనిపోయారన్న సంగతి కూడా తనకు తర్వాత రోజే తెలిసిందన్నారు. పోలీసులు వచ్చి తనతో మాట్లాడలేదని కూడా చెప్పుకొచ్చారు. ఘటన జరిగినప్పటి నుండి షాక్‌లో ఉన్నానని అర్జున్ చెప్పారు.. తాను సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం లేదని తెలిపారు. ఈ ఘటన కారణంగా కలత చెందానని పోలీసులు వద్దని చెప్పడం వల్లనే బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పారు.

ప్రెస్మీట్ మొత్తం మీద తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శల విషయంలో అంతా మిస్ ఇన్ఫర్మేషన్ వల్ల అలా మాట్లాడారు కానీ .. తాను మంచి వాడ్నని చెప్పుకున్నారు. గతంలో తాను చేసిన పరామర్శలు గురించి.. మానవత్వం గురించి చెప్పుకున్నారు. తాను ఇరవై ఏళ్లుగా అందరికీ తెలుసని..అలాంటి వాడిని .. అంటే మానవత్వం లేని వాడిని కాదని చెప్పుకొచ్చారు.

అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత పరామర్శల గురించి మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. లీగల్ సమస్యలు వస్తాయని చెప్పి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుుండా వెళ్లిపోయారు. తర్వాత అరవింద్ మాట్లాడారు. రెండు వారాల నుంచి అర్జున్ బాధపడుతున్నాడని ఓ మూల కూర్చుని ఉంటున్నాడని.. అతన్ని చూస్తే తండ్రిగా బాధేస్తోందన్నారు. ట్రస్ట్ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.

Leave a Comment

You May Like This