నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా అభివృద్ధి,సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వసతి గదులు సరిగా లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని,విద్యార్థులు వారు వసతి ఉంటున్న గదుల్లోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని,వసతి గదులనే ఉదయం తరగతి గదులుగా మరియు సాయంత్రం వసతి గదులుగా మార్చుకొని విద్యార్థులు అందులో ఉంటున్నారు.కాగితాలలో లెక్కలు చూపుతున్నాము తప్పితే చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వసతి అంతంత మాత్రమే అని తెలియజేశారు.నేను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్ కి వెళ్ళినప్పుడు ఈ దుస్థితిని చూడడం జరిగిందని అన్నారు.నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ నెల్లూరు జిల్లాలో ఉన్న సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పరిశీలించి వారికి ఎటువంటి వసతి లోటు లేకుండా చూడాలని ఎమ్మెల్సీ కోరడం జరిగింది.
ఈ సమావేశ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు,నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ నెల్లూరు జిల్లా మండల పరిషత్ అధ్యక్షులు,నెల్లూరు జిల్లా వివిధ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు…*