Advertisements

9 వ రోజుకు చేరుకున్న ఎస్. డబ్ల్యూ.ఎఫ్. “రిలే నిరాహారదీక్షలు”

తిరుపతి జిల్లా ఏ.పీ.ఎస్.ఆర్టీసీ.గూడూరు డిపో ఎదుట కండక్టర్,డ్రైవర్లు, అక్రమ సస్పెన్షన్ లను రద్దు చేయాలని కోరుతూ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఎస్. డబ్ల్యూ.ఎఫ్. సభ్యులు చేపట్టిన “రిలే నిరాహార దీక్షలు” శుక్రవారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలో డిపో కమిటీ ఉపాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎం. గురవయ్య, కూర్చోవడం జరిగింది. నాయకులు కె.ఎస్. వాసులు మాట్లాడుతూ ఎస్. డబ్ల్యు.ఎఫ్.సభ్యులు ఆందోళన డిపో మేనేజరు అవలంబించిన విధానాల పైన జరుగుతున్నదని, యూనియన్ లో లేదా ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఆయన తెలియజేశారు. డిపో మేనేజరు అవలంబించిన వైఖరిని ఉద్యోగులు ఖండించాలని, ఎస్. డబ్ల్యూ.ఎఫ్. చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకి పూర్తి మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.రాము, ఎస్.ఎస్.వి.కృష్ణ,పి.కిరణ్, ఎం.ఎస్.వాసులు, కే.కృష్ణయ్య, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు బి.వి.రమణయ్య,ఎస్.సురేష్,నాయకులు గుర్రం రమణయ్య, ఆటో సంఘం నాయకులు కె.డేవిడ్,వి.భాస్కర్ రెడ్డి, బి.దానియల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment