Advertisements

జనసేన ఆధ్వర్యంలో బిరియానీ ప్యాకెట్లు పంపిణీ

జనసేన ఆధ్వర్యంలో బిరియానీ ప్యాకెట్లు పంపిణీ

గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డు అల్ ఇస్లాం పవర్ టూల్స్ షాపు వద్ద శుక్రవారం చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు, జనసేన నాయకుడు, సయ్యద్ నయీమ్ 60 మంది నిరుపేదలకు బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, దివ్యాంగులు, వృద్ధులకు, మతి స్థిమితం లేనివారు, ఫుట్ పాత్ లపై ఉంటున్న అభాగ్యులను గుర్తించి బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చస్తున్నామన్నారు. వీరందరికీ ఒక్కపూటనైనా కడుపునిండా భోజనం అందించాలన్నదే లక్ష్యమన్నారు. పన్నెండేళ్లుగా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా భోజన ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారంలో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోట్ల రూపాయల సంపాదనలోనూ లేని సంతృప్తి పది మంది ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం అందించడంలో ఉంటుందన్నారు. శక్తి ఉన్నంతవరకూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. అనంతరం భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్, చిరంజీవి యువత నాయకులు, షాప్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment