తీవ్ర విషాదం..
ప్రముఖ సంగీత విద్వాంసుడు మృతి…..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో భారతీయ చలన చిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్నారు.