Advertisements

తన వివాహానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన పీవీ సింధు

తన వివాహానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన పీవీ సింధు

పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు

వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో జీవితం పంచుకోబోతున్న బ్యాడ్మింటన్ స్టార్

ఈ ఈ నెల 22న రాజస్థాన్ లో వివాహం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నెల 22న రాజస్థాన్ లో ఆమె వివాహం జరగనుంది. వరుడు వెంకటదత్త సాయి ఓ వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో, సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖులకు పెళ్లి కార్డులు పంచుతోంది.

ఈ క్రమంలో, నేటి సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసింది. సింధు, ఆమె తండ్రి వెంకటరమణ ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. తన పెళ్లికి రావాలంటూ సింధు వెడ్డింగ్ కార్డు అందించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు విషెస్ తెలియజేశారు. సింధు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు కూడా పెళ్లి కార్డులు అందించడం తెలిసిందే.

Leave a Comment