Advertisements

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మైనారిటీ సదస్సు

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా మైనారిటీ సదస్సు

ఐదు లక్షల మంది మైనారిటీల హాజరు

గూడూరు నుండి రెండు బస్సులలో చలో కడప సదస్సుకు ముస్లిం సోదరులు

రాజ్యాంగ పరిరక్షణ, వక్ఫ్ పరిరక్షణ, జాతీయ సమైక్యత, దేశ ప్రజల సమానత్వమే లక్ష్యంగా కడపలో మైనారిటీ సదస్సు ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు గూడూరు పట్టణ మైనారిటీ నాయకులు తెలిపారు. ఆదివారం చలో కడప కార్యక్రమంలో భాగంగా గూడూరు నుండి రెండు బస్సులు కడపకు బయల్దేరాయి. ఈ బస్సులను మైనారిటీ నాయకులు ఎండీ. అబ్దుల్ రహీం, షేక్. జహాంగీర్, షేక్ కాలేషా, ముఖ్తియార్, సజ్జాద్ మౌలానా, షేక్ జమాలుల్లా, ఖమ్రుల్ ఇస్లాం, ఇలియాజ్ తదితరులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా జమ్యతుల్ ఉలమాయే హింద్ జాతీయ అధ్యక్షుడు షేక్ అర్షద్ దాని సాహెబ్ అధ్యక్షతన కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాదిగా ముస్లిం సోదరులు తరలివస్తున్నట్లు తెలిపారు. గూడూరు నుండి కూడా రెండు బస్సులు, పదికి పైగా కార్లు, టెంపోలలో వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముర్తుజ, సద్దాం, వలీ, అల్లీ హుస్సేన్, గూడూరు, చెన్నూరు, విందూరు, ఉడతావారి పాలెం, పారిచర్ల పాలెం తదితర ప్రాంతాల మైనారిటీ సోదరులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Comment