Advertisements

గూడూరు డిపో మేనేజర్ పై విజిలెన్స్ అధికారులచే విచారణ జరపాలి.ఎస్.కె.జిలాని భాష ఎస్.డబ్ల్యూ. ఎఫ్.ఆర్టీసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు డిమాండ్.

తిరుపతి జిల్లా ఏ.పి. ఎస్.ఆర్టీసి.గూడూరు డిపో కండక్టర్, డ్రైవర్లు,అక్రమ సస్పెన్షన్ లను వెంటనే రద్దు చేయాలని ఎస్.డబ్ల్యూ.ఎఫ్. ఆర్.టి.సి రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్.కె.జిలాని భాష, గూడూరు డిపో ఎదుట ఎస్.డబ్ల్యూ.ఎఫ్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 4వ రోజుకు చేరుకోవడంతో ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ గూడూరు డిపో మేనేజర్ పై తక్షణం విజిలెన్స్ అధికారులచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డి. ఎం. వైఖరి మార్చుకోవాలని అక్రమ సస్పెన్షన్ లను రద్దుచేసి ఉద్యోగులను విధులలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఈ డిపో మేనేజరు వైఖరి చాలా విచిత్రంగా ఉందని, 1/2019 సర్కులర్ ను అందరికీ సమానంగా అమలు చేయాలని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని అది మంచి పద్ధతి కాదని, ఈ డిపోలో బతిమిలాడి కేసులు తీసుకుంటూ ఉండారని, మరి కొంతమంది ఆర్థిక నేరాలకు పాల్పడి కేసులు తీసుకుంటున్నారని, మాకు సమాచారాలు వస్తున్నాయని, దీనిపై విజిలెన్స్ అధికారులు తక్షణం ఎంక్వయిరీ జరపాలని, అలాగే డిపో మేనేజర్ పై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్.డబ్ల్యూ.ఎఫ్. జిల్లా అధ్యక్షులు డి.మల్లికార్జున మాట్లాడుతూ డిపో మేనేజరు నాకేం సంబంధం లేదు. పై అధికారులు ఎలా చెప్తే అలా చేస్తున్నాను అంటున్నాడు. పై అధికారులు మాత్రం అది మీ డిపో పరిధిలో విషయము మా దృష్టికి రాలేదు, అని ఒకరి మీద ఒకటి చెప్పుకుంటున్నారు. అసలు ఈ డిపోలో ఏమి జరుగుతోoది. అనేది స్పష్టత  సభ్యులకి, ప్రజలందరికీ తెలియాల్సి ఉంది. కనుక దీనిపై వెంటనే స్పందించి కమిటీ వేసి  విచారణ జరిపించాలని, సస్పెండ్ చేయబడ్డ ఉద్యోగులను వెంటనే విధులను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కమిటీ ఉపాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ఎం.శేషయ్య, ఎన్.శ్రీనివాసులు,డి.శ్రీధర్, పి. కిరణ్, జి.వి.రమణయ్య, కె. సుబ్రహ్మణ్యం, ప్రాంతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులకు పి. శ్రీనివాసులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.వి.రమణయ్య, ఎస్.సురేష్,నాయకులు ఆర్. శ్రీనివాసులు,గుర్రం రమణయ్య, ముత్యాలయ్య,గండికోట మధు, అడపాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment