ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఖర్గే వెల్లడించారని సీఎం గుర్తు చేశారు. ” ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో మా ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశముంది. ఇబ్బందులు రాకుండా వర్గీకరణ ప్రక్రియ చేపడతాం. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చరిత్రలో తొలిసారి ఓయూ వీసీగా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాం” అని సీఎం వివరించారు.