చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చిరంజీవి!
HYD: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినట్లు తెలియగానే మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా షూటింగ్ను రద్దు చేసుకున్నారు. వెంటనే చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషను బయలుదేరినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే పీఎస్ కు అల్లు అరవింద్, శిరీష్, నిర్మాత దిల్రాజు చేరుకున్నారు.