గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రీ క్రిస్మస్ వేడుకలు*
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్
గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనం నందు గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మరియు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మీ అందరి సహాయ సహకారాల వలన మీ అందరి ప్రార్ధన బలం వలన, ఏసుక్రీస్తు ఆశీర్వాదంతో , నియోజకవర్గంలో ని ప్రజల అభిమానంతో నేను రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందానని మీకెల్లప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని , క్రిస్మస్ లోపల నియోజకవర్గంలోని దైవ సేవకులు అందరితో కలుపుకొని ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తానని, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అని అన్నారు తర్వాత గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ మరియు థీమ్ బైబిల్ కాలేజ్ గూడూరు వారి క్యాలెండర్లను ఆవిష్కరించి దైవ సేవకులకు బ్యాగులు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది . అనంతరం తిరుపతి నుండి విచ్చేసిన దైవ సేవకులు బిషప్ ప్రవీణ్ గారు దేవుని వాక్యం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బక్కా రత్న శేఖర్, ప్రెసిడెంట్ వేల్పుల ప్రభుదాస్ , సెక్రెటరీ డేవిడ్, టిడిపి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్లు పల్లి కోటేశ్వరరావు వేల్పుల రమేష్ కుమార్ , పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కొర్నేలియస్, రమేష్ , విజయ్, నాగరాజు మరియు దైవ సేవకులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు