Advertisements

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం!

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం!

డిల్లీ..

జమిలి ఎన్నికల (One Nation One Election)కు సంబంధించి మరో ముందడుగు పడింది. వీటికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు..

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే (Winter session) జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు (Parliament) హాజరు కావాలని తమ ఎంపీలకు భాజపా, కాంగ్రెస్‌లు విప్‌ జారీ చేశాయి..

జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (JPC)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి..

Leave a Comment

You May Like This