భారీ వర్షం సైతం లెక్కచేయకుండా “రిలే నిరాహార దీక్షలు” చేపట్టిన ఎస్.డబ్ల్యూ.ఎఫ్
తిరుపతి జిల్లా ఏ.పి. ఎస్.ఆర్టీసీ గూడూరు డిపో లో కండక్టర్, డ్రైవర్లు అక్రమ సస్పెన్షన్ లను రద్దు చేయాలని గత ఏడు రోజులుగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అధికారులలో స్పందన లేకపోవడం తో ఎస్. డబ్ల్యూ.ఎఫ్. రీజనల్ కమిటి నిర్ణయం మేరకు సి.ఐ.టి.యు అనుబంధం ఆధ్వర్యంలో భారీ వర్షం సైతం లెక్కచేయకుండా డిపో ఎదుట గురువారం నుండి "రిలే నిరాహార దీక్షలు" చేపట్టడం జరిగింది. ఈ దీక్షల్లో అధ్యక్షులు రాము, డిపో కార్యదర్శి డి.శ్రీధర్ లను సి.ఐ.టి.యు సీనియర్ నాయకులు గుర్రం రమణయ్య ఎర్ర రిబ్బన్లు మెడ లో వేసి దీక్షల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఎఫ్ సీనియర్ నాయకులు ఎం. శేషయ్య మాట్లాడుతూ ఈ సమస్య ఎస్.డబ్ల్యూ.ఎఫ్ వారి ఒక్కరిదే కాదని భవిష్యత్తులో మిగతా యూనియన్లుకు, కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని, మిగతా యూనియన్ ల సభ్యులు కూడా సాటి ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ట్రేడ్ యూనియన్ల నాయకులు జోగి. శివకుమార్, ప్రజా సంఘాల నాయకులు కె.ఆర్. దాసరి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాసులు, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు అధ్యక్ష,కార్యదర్శులు, బి.వి. రమణయ్య, ఎస్.సురేష్, ఆటో కార్మిక సంఘం నాయకులు ఆర్. శ్రీనివాసులు, వి.భాస్కర్ రెడ్డి, కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్, దీక్షలు చేపట్టిన శిబిరం వద్దకు వచ్చి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. దీక్షల్లో ఎస్.డబ్ల్యూ.ఎఫ్. సభ్యులు జి.వి.
రమణయ్య, ఎస్.ఎస్.వి.కృష్ణ, రఘురాం, ప్రభాకర్, డి.ఎస్. వాసులు,చంద్రమోహన్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.