ఆరు నెలల పాలనలో అనేక అడుగులు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ప్రజా ప్రభుత్వం ఆవిర్భవించిందన్న చంద్రబాబు
తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్న సీఎం
గాడితప్పిన వ్యవస్థల్ని ఈ ఆరు నెలల్లో గాడినపెట్టామన్న చంద్రబాబు
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిపోయాయని, నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.