ఆంధ్రప్రదేశ్ :రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు.
అక్రమ సరఫరా చేసే వాళ్లు చాలా స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారని పేర్కొన్నారు.
దీనిని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు.
రేషన్ బియ్యం అక్రమ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు…