Advertisements

ఏ తప్పు చేయని మన్నెం శీనయ్య ను వెంటనే విడుదల చేయాలి.

ఏ తప్పు చేయని మన్నెం శీనయ్య ను వెంటనే విడుదల చేయాలి.
-మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యే బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు పోలీసులకు విన్నపం

గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇటీవల చిల్లకూరు మండలంలో నాంచారంపేట, ముత్యాలపాడు గ్రామాలలోని రెండు గ్రూప్ ల తగాధాలలో ఒక యువకుడు ప్రాణం కోల్పోయిన విషయం తెలిసిందే,ముందుగా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు.అయితే ఈ సంఘటనతో సంభంధం లేని జెడ్పిటిసి మన్నెం శీనయ్య అరెస్ట్ అవ్వడం చాలా బాధాకరం అన్నారు.శీనయ్య భార్య మరియు కుటుంబ సభ్యులను వెంటతీసుకొని ఎస్పీ ని కలవడం జరిగిందని,ఎస్పీ కూడా వెంటనే స్పందించి శీనయ్య కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించారని, ఆయనకుడా చట్టబద్ధంగా తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు.స్థానిక ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి కూడా వాస్తవాలు తెలియజేసామని, ఎమ్మెల్యే కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఎస్పీ తో మాట్లాడరన్నారు.ఈసందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు జరిగిన సంఘటన పూర్తి విచారణ చేసి సంబంధంలేని మన్నెం శీనయ్య ను విడుదలైందుకు మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు.అలాగే భవిష్యత్ లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పీస్ కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆయన కోరారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు దుగ్గన వినీష్ యాదవ్, వంక రమణయ్య,తూపిలి లక్ష్మీ, సయ్యద్ మథర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment