Advertisements

రోడ్డు పై డ్రైనేజీ నీటిని తొలగించాలి

మున్సిపల్ కమీషనర్ కు పిర్యాదు చేసిన బిజెపి అధ్యక్షుడు
-స్పందించి చర్యలు చేపట్టిన కమీషనర్

    గూడూరు రెండో పట్టణంలోని నరసింగరావు పేట సచివాలయం ఎదురు వీధిలో ఒకరిద్దరూ పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని డ్రైనేజీ సౌకర్యం లేకుండామురుగు నీరు రోడ్డు పైకి వదలడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బిజెపి గూడూరు అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావుకు ఫిర్యాదు చేశారు.స్పందించిన కమీషనర్ యుద్ధ ప్రాతపదికన జేసిబి ని తీసుకొచ్చి స్వయంగా దగ్గరుండి సమస్యను పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ తో పాటు సచివాలయం శానిటరీ ఇన్స్పెక్టర్ మధు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    Leave a Comment