Advertisements

పోరాటానికి మేము సిద్ధమే”సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు  జి.బాలసుబ్రమణ్యం

తిరుపతి జిల్లా ఏ.పి. ఎస్.ఆర్టీసి.గూడూరు డిపో ఎదుట కండక్టర్,డ్రైవర్లు, అక్రమ సస్పెన్స్ లను రద్దు చేయాలని సి.ఐ.టి.యు అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం మంగళవారానికి ఆరవ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి కె. యస్.వాసులు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనిన సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ జి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గూడూరు డిపో మేనేజరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సి.ఐ.టి.యు అనుబంధ సంస్థ ఏ.పి.ఎస్.ఆర్టీసి స్టాఫ్.అండ్.వర్కర్స్.ఫెడరేషన్ సంఘాన్ని బలహీన పరచాలని అక్రమ సస్పెన్స్ లకు పూను కుంటున్నారని, ఇది మంచిది పద్ధతి కాదని, ఇప్పటికైనా డిపో మేనేజర్ స్పందించి ఎస్.డబ్ల్యూ. ఎఫ్. సభ్యులు అక్రమ సస్పెన్షన్లను రద్దుచేసి వెంటనే విధులలోకి తీసుకోవాలని, అలా చేయని పక్షంలో “పోరాటానికి  మేము సిద్ధమేనని” హెచ్చరించడం జరిగింది. సంస్థ పరిరక్షణకు కార్మికుల హక్కుల సాధనకై సి.ఐ.టి.యు చారిత్రాత్మక పోరాటాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందేనని, అటువంటి సంఘాన్ని తొక్కి పెట్టడానికి గూడూరు డిపో మేనేజర్ పూనుకొనడం బావ్యం కాదని, చట్టం అందరికీ వర్తిస్తుందని ఒక్కొక్క యూనియన్ కి ఒక్కొక్క రకంగా ఉండదని, ఇతర సంఘాలకు 1/2019 సర్కులర్ వర్తింపజేస్తూ ఎస్.డబ్ల్యు.ఎఫ్ సంఘానికి చెందిన కార్మికులను సస్పెండ్లు చేయడం దుర్మార్గమని, ఈ పోరాటం గూడూరు డిపోకె పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉదృతం చేయడం జరుగుతుందని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా విజయవాడలోని ఎం.డి ఆఫీస్ ను ముట్టడిస్తామని వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గూడూరు డిపో మేనేజరు అక్రమాలకు అడ్డుకట్టు వేయాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు సి.హెచ్.రాము,ఎస్. ఎస్.వి.కృష్ణ,రఘురాం, కత్తి. సుబ్రహ్మణ్యం, ఏ.శీనయ్య, సుబ్రహ్మణ్యం ఎమ్.యస్. వాసులు, నాగేశ్వరరావు, పి. కిరణ్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ నాయకులు జోగి. శివకుమార్, డి.వెంకట్రామిరెడ్డి బి.వి.రమణయ్య, ఎస్.సురేష్, ముత్యాలయ్య, గుర్రం రమణయ్య, భాస్కర్ రెడ్డి, బి.చంద్రయ్య,పుట్టా.శంకరయ్య, గండికోట మధు,ప్రజా సంఘాల నాయకులు కె.ఆర్.దాసరి  తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment