Advertisements

మద్యం సేవించి వాహనాలు నడిపినా,సరైన పత్రాలు లేకున్నా కఠిన చర్యలు తప్పవు


రెండవ పట్టణ ఎస్.ఐ బి.గోపాల్
కోర్టు సెంటర్ లో వాహనాల తనిఖీ
వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడిపినా,వాహనాలకు సరైన పత్రాలు లేకున్నా కఠిన చర్యలు తప్పవని రెండవ పట్టణ ఎస్.ఐ బి.గోపాల్ హెచ్చరించారు.ఆదివారం సాయంత్రం స్థానిక కోర్టు సెంటర్ లో ఆయన తన సిబ్బంది తో కలసి వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహన చోదకులను గుర్తించేందుకు తనిఖీ చేపట్టారు.నిబంధనలకు వ్యతిరేఖం గా వాహనాలు నడిపితే చర్యలు చేపడతామని ఎస్.ఐ గోపాల్ వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.నిబంధనలను పాటించని వారికి అపరాధ రుసుము విధిస్తామని ఆయన తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణ కు సహకరించాలని ఎస్ ఐ సూచించారు.

Leave a Comment