Advertisements

ఆర్చరీ క్రీడాకారులకు రూ 50,000/- లు ఆర్థిక సహాయం అందించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్

తిరుపతి జిల్లా గూడూరు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి దాతృత్వంలో ఆర్చరీ క్రీడా పోటీలలో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించిన క్రీడాకారునికి మరియు జాతీయ స్థాయిలో పాల్గొన్న ఏడు మంది ఆర్చరీ క్రీడాకారులకు మెమెంటో లను బహుకరించారు. కోచ్ శంకర్ ను సన్మానించి జ్ఞాపకను అందించారు. అనంతరం జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన తరునీష్ జత్య క్రీడాకారునికి 30 వేల రూపాయలు మరియు కోచ్ శంకర్ గారికి 20 రూపాయలను MLA గారు అందించడం జరిగింది. అనంతరం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ గూడూరు హాకీలో నేషనల్ స్థాయి ప్లేయర్లు ఉన్నారని క్రికెట్ లో కూడా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అదే విధంగా ఆర్చరీ లో ఇంత మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రానిస్తున్నారని వారిని మంచి క్రీడాకారులు గా తయారుచేసిన కోచ్ లందరిని అభినందిస్తున్నానని చెప్పారు. బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు తరునీష్ జత్య ను ముఖ్యమంత్రి మరియు లోకేష్ బాబు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఆర్చరీ క్రీడాకారులు త్వరలో ఒలంపిక్స్ స్థాయికి ఎదగాలని కోరారు..క్రీడాకారులు గూడూరుకి మంచి పేరు తేవాలని అన్ని రంగాల క్రీడాకారులకి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, వసంత్ కుమార్, సేగు వెంకటేశ్వర్లు, బెజవాడ రమేష్, లవకుమార్, కోటేశ్వరరావు, దీపక్ ఆకాష్, విజయ్, రవి కుమార్, చిరంజీవి, పురుషోత్తం, మునీఫ్ మరియు క్రీడాకారులు, వాకర్స్ పాల్గొన్నారు.

Leave a Comment