ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు మధ్య సఖ్యతను పెంచడానికి మెగా పేరెంట్స్ మీటింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది
ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బెరద వాడ వద్ద ఉన్న బాలికల గురుకుల పాఠశాలలోఘనంగా నిర్వహించారు..
ఈ సమావేశానికి ముఖ్యఅతిదులుగా సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. పార్థసారథి దంపతులు మరియు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి సాదర స్వాగతం పలికారు… అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ.. నెలవల విజయశ్రీ కి అపూర్వ స్వాగతం పలికారు.. కళాశాల ప్రిన్సిపల్ రూత్ రమొల తో కలిసి .. పాఠశాల పరిసర ప్రాంతాలను సందర్శించి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. నారా లోకేష్ సూచనల మేరకు.. ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు మధ్య సఖ్యతగా ఉండేలా ఏర్పాటు చేసిన కార్యక్రమమే.. ఈ ఆత్మీయ సమావేశం అన్నారు… చదువు అనేది ప్రతి విద్యార్థికి ఒక పునాది లాంటిదని.. ప్రతి ఒక్కరూ ఆ పునాదిని ఇప్పటినుంచే. దృఢంగా చేసుకోవాలన్నారు.. విద్యలో కానీ ఆటల్లో కానీ ప్రతిభ కనబరిచే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం.. ప్రోత్సాహానందిస్తుందన్నారు…
అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..
ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నుంచి ప్రారంభించామని..స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారాయని.. ఏ ప్రభుత్వం కూడా.. విద్యార్థులు తల్లిదండ్రులు నేరుగా.
తమ పిల్లల భవిష్యత్తు గురించి.. వారు ఎలా చదువుతున్నారు…
వారికి సరైన భోజన వసతి అందుతుందా లేదా..
ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తున్నారా లేదా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలియజేశారు…
అనంతరం నెలవల.విజయశ్రీ తన సొంత నిధులతో 700నోటు పుస్తకాలను.. విద్యార్థులకు పంచిపెట్టారు…
ఈ కార్యక్రమంలో..తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీరాం ప్రసాద్, నాయుడుపేట మండల ఎంఈఓ,నాయుడుపేట ఎంపీడీవో
నాయుడుపేట పట్టణ సిఐ బాబి,
కళాశాల ప్రిన్సిపల్ రూత్ రమోలా..
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు..