తిరుపతి జిల్లా,చిల్లకూరు మండలం,చిల్లకూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ కు అపూర్వ స్వాగతం పలికిన విద్యార్థులు,ఉపాధ్యాయులు,స్థానిక ప్రజాప్రతినిధులు
అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక మెగా పరెంట్ టీచర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడి ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.ఈ సమావేశ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వాకాటి ప్రభాకర్,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ కవిత,స్కూల్ మేనేజ్మెంట్ వైస్ ఛైర్మన్ ఎన్.వి రమణయ్య,సూరిశెట్టి హరికృష్ణ,కనపర్తి దిలీప్ రెడ్డి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాన్ పీటర్,ఇతర ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది,చిల్లకూరు మండలం ఎంపిడిఓ యం.గోపి,వివిధ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు