అంబేడ్కర్ ఆశయాలను జనసేన కొనసాగిస్తుంది
భారత రాజ్యంగ నిర్మాత దాదా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను జనసేన పార్టీ కొనసాగిస్తుందని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ రావు తెలిపారు. డా.బి.ఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం అంబేడ్కర్ చిత్రపటానికి జనసేన నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీగల చంద్ర శేఖర్ రావు మాట్లడుతూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేసి, దేశంలో అసమానతలు రూపుమాపేందుకు భారత రాజ్యాంగాన్ని రచించిన సమరయోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ ఉన్నతమైన ఆశయాలు, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా పని చేస్తున్న సిఎం చంద్రబాబు నాయడు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ బాటలో పయాణిస్తూ అంబేడ్కర్ ఆశయాలను ప్రజలకు చేరవేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్య్రమంలో పిఓసి మోహన్, జనసేన ప్రధాన కార్యదర్శులు నాగార్జున, వంశీ కృష్ణ, సాయి కిరణ్, మనోజ్ కుమార్, మధుసుదన్ రావు,శ్రీను, సుబ్రమణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు .