Advertisements

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్-పాశిం సునీల్ కుమార్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్-పాశిం సునీల్ కుమార్

గూడూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవ్ కార్యక్రమాలు

గూడూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ముందుగా టవర్ క్లాక్ సేటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నాధనాన్ని ప్రారంభించి,స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు, భారతదేశ ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ వలనే నేడు అణగారిన వర్గాలకు గుర్తింపు వచ్చిందని,ఆయన అడుగుజాడల్లోనే మేము నడుచుకుంటామన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారికి సంబంధించి జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. అనంతరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు గూడూరు మునిసిపల్ కమిషనర్ వెంకటేస్వరరావు,హాస్పిటల్ సుపెరిండెంట్ షేక్ షరీనా బేగం, గూడూరు ఒకటవ పట్టణ ఏఈ ఏడుకొండలు ముఖ్యఅతిథులుగా హాస్పిటల్ లోని గర్భిణీ స్త్రీలు, బాలింతలకు బ్రేడ్,పండ్లు, ఎనర్జీ డ్రింక్ పంచిపెట్టారు. ఈకార్యక్రమాలలో గోను శివకుమార్, చింతల చిరంజీవి, శీలం కిరణ్ కుమార్ మరియు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment