Advertisements

బాలాయపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ


…. వర్ధంతి నాడు స్ఫూర్తి ప్రధాత విగ్రహ స్థాపన ….
…. రాజ్యాంగ నిర్మాత కు బహుజన యువత ఘన నివాళి …..
బాలాయపల్లి : తిరుపతి జిల్లా లోని మండల కేంద్రమైన బాలాయపల్లి లో అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రధాత,రాజ్యాంగ నిర్మాత,మహనీయుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన శుక్రవారం జరిగింది.అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఆర్ టీ సీ బస్టాండ్ సెంటర్ లో దళిత,బహుజనులు స్వచ్చందంగా మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పారు.ఈ సందర్బంగా విగ్రహ స్థాపనకు కృషిచేసిన దళిత నాయకులు మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ప్రసాధించిన వెలుగు దివ్వె అంబేద్కర్ విగ్రహాన్ని బాలాయపల్లి లో ఏర్పాటు చేసుకోవడం తమకెంతో గర్వకారణం గా ఉందన్నారు.అణగారిన వర్గాల గొంతుకగా అంబేద్కర్ అనుసరించిన త్యాగాలు స్ఫూర్తిదాయకం అన్నారు.అంబేద్కర్ విగ్రహాన్ని చైతన్య ప్రతీకగా భావిస్తూ మండలం లోని దళిత,గిరిజన,బహుజన,మైనార్టీల ఐక్యత కు కృషి చేస్తామన్నారు.హక్కుల సాధనకు కలసికట్టుగా పనిచేస్తామన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా అణగారిన వర్గాల చైతన్యమే లక్ష్యం గా మహనీయుడు అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తాం అన్నారు.ఈ కార్యక్రమం లో దళిత,బహుజన నాయకులు న్యాయవాదులు పెట్లూరు రాంప్రసాద్,పెట్లూరు కమలాకర్, కనుపూరు నాగయ్య, తలారి కోటయ్య, పరమాల వెంకటేశ్వర్లు, పెట్లూరు మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment