తిరుపతి జిల్లాకోట మండలం నియోజకవర్గం పరిధిలోని తీరప్రాంత ST ప్రజలతో ARD సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్యఅతిదిగా కోట పట్టణం షాదిమంజిల్ నందు సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఎమ్మెల్యే
పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ….
నియోజకవర్గంలో తీరప్రాంతాలలో ఎక్కువుగా యానాది కుటుంబాల ఉన్నాయని మీ అందరికి ఆధార్ కార్డులు కూడా సరిగా లేవుఅన్నారు .అందురు మొదట ఆధార్ కార్డులు చేయించుకుంటే, ప్రభుత్వం ద్వారా కాలనీ ఇళ్ళు మీకు మంజూరు చేస్తామని తెలిపారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు మరియు పులికాట్ సరస్సు అంచున ఉన్న పేద ప్రజల సమస్యల కొరకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ లో ఉన్నటువంటి నిధులతో అక్కడ ఉన్న మీ అందరికీ మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసేలాచర్యలు తీసుకుంటామని అన్నారు.ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గారి ద్వారా నిధులు త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుని మీ అందరికీ సదుపాయాలు ఏర్పాటు చేయిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, దసరధరామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, సురేష్, శంసుద్దీన్, మధు యాదవ్, ARD సంస్థ అధినేత బషీర్ తదితరులు పాల్గొన్నారు