డిసెంబర్ ఆరో తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు గూడూరు డివిజన్ లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజల తన సమస్యలను రెవెన్యూ సదస్సులో తెలియజేయాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కోరారు
గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సదస్సుల ఏర్పాటుపై డివిజన్ లోని తాసిల్దార్లు ఎంపీడీవోలతో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఏ గ్రామంలో ఎప్పుడు జరిగేది రెండు రోజుల ముందు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని సమస్యలు ఉన్న ఉన్నవారు రెవిన్యూ సదస్సులో తెలియజేస్తే త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు