తిరుపతి జిల్లా లోని గూడూరు ఏ.పీ.ఎస్.ఆర్టీసీ డిపో మేనేజర్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మానుకోవాలని, అక్రమ సస్పెండ్లు ను, రద్దు చేయాలని కోరుతూ గూడూరు డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి డి. శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం రోజు డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతూ డిపో లో పనిచేస్తున్న డ్రైవర్లు మరియు కండక్టర్లు విధులు నిర్వహించే క్రమంలో జరిగే ప్రమాదములు, కండక్టర్లు కేసులు పరిష్కరించి న్యాయం చేయడంలో డిపో మేనేజర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని, అందరి కార్మికుల పట్ల సమైక్యత భావంతో మెలగాలని 1/2019 సర్కులర్ లోబడి చర్యలు తీసుకోవాల్సి ఉండగా తన ఇష్టానుసారంగా ఆయనకి అన్ని విధాలను నచ్చిన వారికి ఏకపక్షంగా న్యాయం చేస్తూ మరి కొంతమందిని ఉద్దేశపూరితంగా, అన్యాయంగా విధుల నుండి సస్పెండ్లు చేయడం జరిగిందని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అప్పటివరకు ఆందోళన కార్యక్రమాలు ఆపేది లేదని, లేనియెడల జరగబోవు పరిణామాలకు డిపో మేనేజరు గారి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో నాయకులు సి.హెచ్.రాము, ఈ. భాస్కర్, కె.కృష్ణయ్య, కె.యస్. సుబ్రహ్మణ్యం, జి.వి.రమణయ్య డి.ఎస్.వాసులు, డి.పి.రావు, పి కిరణ్, సి.ఐ.టి.యు.నాయకులు డి.వెంకట్రామిరెడ్డి, బి.వి.రమణయ్య, ఎస్.సురేష్, అడపాల ప్రసాద్, గుర్రం రమనయ్య, తదితరులు పాల్గొన్నారు.