
గూడూరు పట్టణం:- డివిజన్ పరిధిలోని విద్యుత్ సిబ్బందితో క్యాంప్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాలలో విద్యుత్ లైన్లు ఇళ్లపైన వెళుతున్నాయని,అలాగే కొన్ని గ్రామాలలో లైన్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో రైతులు వరి నాట్లు ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారని కొంతమంది రైతులు ట్రాన్స్ఫర్మర్ లేక ఇబ్బంది లు పడుతున్నారని అటువంటి రైతులు ఇబ్బంది పడకుండా వారికి ట్రాన్స్ఫర్మర్ లు అందించాలని తెలిపారు. మీకు కావాలసిన ప్రపోసల్స్ నా దృష్టికి తీసుకువస్తే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించుకుని వస్తానని తెలిపారు.
కావున రైతుల సాగుకు విద్యుత్ అంతరాయం లేకుండా అందించే లా చూడాలని తెలిపారు.
ఈ సమావేశంలో నాయకులు . విద్యుత్ సిబ్బంది తతిధరులు పాల్గొన్నారు.
