Advertisements

ఏ.పి.ఎస్.ఆర్టీసి గూడూరు డిపో లో అక్రమ సస్పెండ్లను రద్దు చేయాలి.స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్  జిల్లా కార్యదర్శి

A.P.S.R.T.C తిరుపతి జిల్లా గూడూరు డిపో మేనేజరు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యుల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య పక్ష పాతవైఖరిని మానుకోవాలని అక్రమ సస్పెండ్లను రద్దు చేయాలని, స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి E.శివకుమార్ హెచ్చరించడం జరిగింది. బుధవారం రోజు స్థానిక సి.ఐ.టి.యు కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు డిపో లో పనిచేస్తున్న డ్రైవర్లు మరియు కండక్టర్లు విధులు నిర్వహించే క్రమంలో జరిగే ప్రమాదములు, కండక్టర్ల కేసులు పరిష్కరించి న్యాయం చేయుటలో  డిపో మేనేజరు యూనియన్ల వారిగా నిర్లక్ష్య పక్షపాతవైఖరి అవలంబిస్తున్నారని, ఈ మధ్యకాలంలో ప్రమాదములు జరిగినట్లు అభియోగం ఎదుర్కొనుచున్న  డ్రైవర్లకు న్యాయం చేయడంలోనూ, కండక్టర్ల కేసులు పరిష్కరించడంలోనూ సర్యులర్ నం. 1/2019 లోబడి  చర్యలు తీసుకొనవలసి యుండగా తన ఇష్టానుసారం కొంతమందికి మాత్రమే సర్యులర్ అమలుచేసి న్యాయం చేస్తూ,  మరి కొంతమందిని ఉద్దేశ పూరితంగా, అన్యాయంగా ఏకపక్షంగా విధులనుండి సస్పెండ్లు చేయుడం జరిగింది. ప్రత్యేకించి స్టాఫ్ & వర్క ఫెడరేషన్ సభ్యులకు 1/ 2019 సర్క్యులర్ను  అమలుచేయకుండా తన ఇష్టాను సారంగా సస్పెండ్లు చేయడం అన్యాయం అని ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవతీసుకొని అక్రమ సస్పెడ్లును రద్దు చేయించి ఉద్యోగులను విధులకు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు డి.మల్లికార్జున, డిపో అధ్యక్ష,కార్యదర్శులు సి.హెచ్.రాము, జి.శ్రీధర్,రీజనల్ నాయకులు కె. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment