కాకినాడ పోర్టును బలవంతంగా
లాక్కున్నారు: చంద్రబాబు
AP: ఆస్తులు లాక్కోవడం వైసీపీ హయాంలో ట్రెండ్గా మారిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేబినెట్ సమావేశంలో భాగంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. “బియ్యం, భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఈ మాఫియాలను అరికడతాం. కాకినాడ పోర్టు, సెజ్ను బలవంతంగా లాక్కున్నారు. కాకినాడ పోర్టులో 41 శాతం అరబిందో వాళ్లు లాక్కున్నారు” అని సీఎం ఆరోపించారు.