పేద విద్యార్థిని ఉన్నత చదువులకు ఎమ్మెల్యే, గ్రీన్ ఫౌండేషన్ చేయూత
తిరుపతి జిల్లా కోట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామసుందరపురం ప్రాంతానికి చెందిన నిరుపేద విద్యార్థిని కురుగొండ కరుణకు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, గ్రీన్ ఫౌండేషన్ సంస్థల దాతృత్వంతో 20 వేల రూపాయలు చేయూతనందించారు. ఈ మేరకు 20 వేల రూపాయల కోటలోని ఎస్కేబీ కాంపౌండ్స్ లో శనివారం గ్రీన్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ విద్యార్థిని తల్లి కవితకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్లో ప్రతిభ చాటుతూ నీట్ కు ప్రిపేర్ అవుతున్న కురుగొండ కరుణ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నేపథ్యంలో విద్యార్థిని కుటుంబసభ్యులు గ్రీన్ ఫౌండేషన్ వారిని కలవడంతో, గ్రీన్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఎమ్మెల్యే సహకారంతో వారికి 20,000 రూపాయలు చెక్ అందించడం జరిగిందన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రీన్ ఫౌండేషన్ ఇతోధికంగా సహాయం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో.. కోట ఎంపీటీసీలు షేక్ షంషుద్దీన్, దారా సురేష్, షేక్ నౌషాద్, షేక్ బాబు పాల్గొన్నారు.