🟡ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశంలో గళం విప్పిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి…
💢తేది:-08-11-2024,నెల్లూరు కలెక్టరేట్,యస్.పి.యస్.ఆర్ నెల్లూరు జిల్లా…
💢నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నందు జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం.
💢ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసన మండలిసభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి.
🟠స్వర్ణముఖి బ్యారేజి నీటి అవసరములకు కండలేరు జలాశయము నీటి వినియోగము కొరకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరిన ఎమ్మెల్సీ
🟠రాపూరు,పొదలకూరు,వెంకటగిరి,సూళ్లూరుపేట,గూడూరు,శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణముల త్రాగునీటి అవసరములకు మరియు స్థానిక చెరువులు మరియు పాడి పశువుల నీటి అవసరములకు 3 టీఎంసీలు నేను విడుదల చేయాలని కోరిన ఎమ్మెల్సీ…
🟠స్వర్ణముఖి నదికిందున్న ఈ 48 చెరువులు,30121.02 ఎకరాల వ్యవసాయానికి గాను 1.5 టీఎంసీ నీటి అవసరం.
🟠రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కోరిన ఎమ్మెల్సీ.
🟠స్పందించిన మంత్రి పొంగూరు నారాయణ నీటి విడుదలకు అంగీకారం.
🟠మంత్రి స్పందనకు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు.
🟠ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నందు అధికారులు నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని గళం విప్పారు.స్వర్ణముఖి నదికి కేటాయించిన 2 టీఎంసీల బదులుగా 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు.
🟠ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ,సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని కోట,వాకాడు చిట్టమూరు,పెళ్లకూరు నాయుడుపేట,ఓజిలి మండలాలలోని స్వర్ణముఖి నదిలోనికి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలి అని కోరారు.ముఖ్యంగా పెళ్లకూరు మండలంలోని పాల్చూరు ఆయకట్ట కింద 13 ట్యాంకులు వాటి కింద 6800 ఎకరాలకు పారుదల ఉంది.నాయుడు పేట మండలంలో 8 ట్యాంకులు వాటి కింద 2837.42 ఎకరాలకు పారుదల ఉన్నట్లు తెలిపారు.
🟠అదేవిధంగా కోట మండలంలోని కోట ఆనకట్ట చల్ల కాలువ దగ్గర 11 చెరువులు వాటి కింద 5417.54 ఎకరాలకు పారుదల,వాకాడు మండలంలోని స్వర్ణ స్వర్ణముఖి బ్యారేజ్ ద్వారా పది చెరువులు వాటి కింద 9022 ఎకరాలకు పారుదల ఉందన్నారు.ఈ విధంగా మొత్తం 48 చెరువుల కింద 30121.02 ఎకరాలు పారుదల ఉంది.స్వర్ణముఖి నదికిందున్న ఈ 48 చెరువులు,30121.02 ఎకరాల వ్యవసాయానికి గాను 1.5 టీఎంసీ నీటి అవసరం ఉంది అన్నారు.
🟠రాపూరు,పొదలకూరు,వెంకటగిరి,సూళ్లూరుపేట,గూడూరు,శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణముల త్రాగునీటి అవసరములకు మరియు స్థానిక చెరువులు మరియు పాడి పశువుల నీటి అవసరములకు అధికారులు కండలేరు జలాశయము నీటి వినియోగము కొరకు 2 టీ.యం.సీలు ప్రతిపాదిస్తే నీటి కేటాయింపులు సరిపోవు అని 3 టీ.యం.సీలు నీటిని కేటాయించవలసిందిగా జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణని కోరిన ఎమ్మెల్సీ…
🟠స్వర్ణముఖి బ్యారేజి నీటి అవసరములకు అధికారులు కండలేరు జలాశయము నీటి వినియోగము కొరకు 2 టీ.యం.సీలు ప్రతిపాదిస్తే నీటి కేటాయింపులు సరిపోవు అని 3 టీ.యం.సీలు నీటిని కేటాయించవలసిందిగా జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణని కోరిన ఎమ్మెల్సీ…
🟠తాగునీటి అవసరాలకు గాను 0.75 టీఎంసీ నీటి అవసరం ఉంది,ఈ ప్రాంతాల్లో 59 కిలోమీటర్ల పొడవు మరియు వెడల్పు 250 మీటర్ల నుంచి 500 మీటర్లు ఉన్న స్వర్ణముఖి నదిలో నీటి ఆవిరి కింద 0.75 టీఎంసీ నీటి అవసరం ఉంది.అందువలన ఈ అవసరాల నిమిత్తం దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా స్వర్ణముఖి నదిలోకి 3 టీఎంసీల నీటిని విడుదల చేయవలసిందిగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు కోరడంతో వెంటనే స్పందించిన మంత్రి త్వరలోనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్వర్ణముఖి నదికి 3 టీఎంసీ నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మంత్రికి ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలియజేశారు.
🟠ఈ సమావేశ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు,సర్వేపల్లి, కావలి,కోవూరు,సూళ్లూరుపేట,వెంకటగిరి శాసనసభ్యులు,నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారు,జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ గారు,నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులు,వివిధ రైతు సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు…