ప్రభుత్వ భూమి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి
-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు డిమాండ్
గూడూరు డివిజన్ చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ చేస్తున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ చిట్టమూరు మండలం రంగనాథపురం పంచాయతీ పిట్టివానిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 1-1 లో 12 ఎకరాల 30 సెంట్లు సర్వే నంబరు 36లో ఎనిమిది ఎకరాలు సర్వేనెంబర్ 41 లో 13 ఎకరాల భూమి పిట్టివాని పల్లి గ్రామంలోని పదిమంది రైతులకు సుమారు రెండు ఎకరాలు చొప్పున 1970లో ప్రభుత్వము అసైన్మెంట్ పట్టాలిచ్చారు. అదే భూమిని 1992లో వాకాడు మండలం రైతులకు అసైన్మెంట్ పట్టాలిచ్చారు ఈ రెండు గ్రామాల రైతులు తమవే,తమవే అంటూ చిట్టమూరు మండల తాసిల్దార్ కార్యాలయము, గూడూరు ఆర్డీవో కార్యాలయము, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేసి నష్టపోయారు ఇది ఇలా ఉండగా పిట్టు వానిపల్లి భూస్వాములు తేరువాయి మణి తేరువాయి చిరంజీవి, తేరువాయి చంద్రయ్య, తేరువాయి తిరుపాలు, మంజుల, మధు, అనేవారులు వారి బంధువుల పేర్లతో గత వైసిపి ప్రభుత్వం లో ప్రభుత్వ నాయకుల, అధికారులు అండదండలతో పాసుబుక్కులు చేయించుకొని గతంలో అసైన్మెంట్ పట్టాలు పొందిన రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి అసైన్మెంట్ పట్టాలి ఇప్పించాలని డిమాండ్ చేశారు ఇంతే కాకుండా 100 ఎకరాల భూమిని ఇతర గ్రామాల నుండి భూస్వాములు ఆక్రమించుకొని ఆక్వా సాగు చేసుకునేవారు.ఆక్వా సాగును రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఖాళీగా ఉన్న భూమిని పిట్టివానిపల్లి గ్రామంలోని పేద కుటుంబాలకు పట్టాలు ఇప్పించి సాగు చేసుకునే విధంగా కల్పించాలని బిజెపి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు, రాష్ట్ర యువమోర్చా నాయకులు కే దయాకర్, గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి గుంజి శ్రీనివాసులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.