Advertisements

ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన బల్లి దుర్గాప్రసాద్ రావు సేవలు

????ఘనంగా దివంగత నేత మాజీ మంత్రి బల్లి దుర్గ ప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలు

*???? గూడూరు,చిల్లకూరు, కోట,నాయుడుపేట,తిరుపతి *జయంతి వేడుకలు*

???? వెంకటగిరిలో బల్లి దుర్గ ప్రసాద్ ఘాట్ వద్ తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ శ్వేత దంపతులు మరియు కుటుంబ సభ్యులు నివాళిలు

???? మాజీ మంత్రి బల్లి దుర్గ ప్రసాద్ రావు 68వ జయంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు

???? భారీ కేక్ లు కట్ చేసి బల్లి దుర్గ ప్రసాద్ రావు పై ఉన్న అభిమానం చాటిన అభిమానులు

???? ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన బల్లి దుర్గాప్రసాద్ రావు సేవలు

✍️✍️:దివంగత నేత మాజీ విద్యా శాఖ మంత్రి బల్లి దుర్గ ప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలు మంగళవారం వాడ వాడల వైసీపీ నాయుకులు, కార్యకర్తలు, బల్లి అభిమానులు ఘనంగా నిర్వహించారు.బల్లి దుర్గ ప్రసాద్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు.అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి అభిమానం చాటారు.

????గూడూరు పట్టణం లో – అధ్యాత్మిక వేత్త కోట సునీల్ కుమార్,డివిఎంసి సభ్యులు వాకాటి ప్రభాకర్ రావు,చిల్లకూరు జడ్పిటిసి మన్నెం శ్రీనివాసులు ఆధ్వర్యంలో…

మాజీ మంత్రి,దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలను డివిఎంసి సభ్యులు వాకాటి ప్రభాకర్ రావు,చిల్లకూరు జడ్పిటిసి మన్నెం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద దుర్గాప్రసాద్ రావు అభిమానులు,నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికిపంచిపెట్టారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు..ఈ కార్యక్రమంలో అధ్యాత్మిక వేత్త కోట సునీల్ కుమార్,తిరుపతి జిల్లా డి.వి.ఎం.సి సభ్యులు వాకాటి ప్రభాకర్,చిల్లకూరు మండలం జడ్పీటీసీ మన్నెం శీనయ్య,మాజీ అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు,పేటేటి చంద్రనీల్, కట్టికల సురేష్,సంజీవ నాయుడు,రమేష్,సుబ్బారావు,బల్లి బెనర్జీ,మధిరి సునీల్,చిన్న,సాయి తదితరులు పాల్గొన్నారు. నాయకులు పెటేటి చంద్రనీల్,తదితరులు పాల్గొన్నారు.

????కోటలో – తిరగబత్తిన ప్రసాద్, పాల్ రాజ్,మారు శీను ఆధ్వర్యంలో

మాజీ మంత్రి,దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలను కోటలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పంచి పెట్టి అన్న దానం చేసి అభిమానం చాటారు. ఈ కార్యక్రమం లో బల్లి అభిమానులు పాల్గొన్నారు.

????తిరుపతిలో…. గంగుల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో…

మాజీ మంత్రి,దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలను తిరుపతి లో..గంగుల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో.. దుర్గాప్రసాద్ రావు అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి పంచి పెట్టారు.అనంతరం అన్నదానం చేశారు.

????నాయుడుపేట లో జయ్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో..

మాజీ మంత్రి,దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ రావు 68వ జయంతి వేడుకలను నాయుడుపేటలో..జయ్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో.. దుర్గాప్రసాద్ రావు అభిమానులు,నాయకులు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి పంచి పెట్టారు.అనంతరం అన్నదానం చేశారు.

????వేంకటగిరిలో.. బల్లి దుర్గ ప్రసాద్ రావు ఘాట్ వద్ద తనయుడు నివాళులు

వెంకటగిరి పట్టణంలోని బల్లి దుర్గాప్రసాద్ రావు ఘాట్ వద్ద68వ జయంతి సందర్భంగా వారి తనయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి,కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు అర్పించారు.

Leave a Comment