దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలు, కళాశాలలు పై విద్యాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి
దసరా సెలవులు లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటాం
:ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చిన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీపతి చిన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు ప్రకటించిన దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాల పై విద్యాశాఖ అధికారులు ఘటన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీ విద్యార్థి సంఘం నాయకులు శ్రీపతి చిన్న డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సెలవులు తరగతులను నిర్వహిస్తున్నాయన్నారు. అలాంటి పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు .ప్రభుత్వం నిబంధనల ప్రకారం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అన్నారు. అయితే కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రత్యేకత తరగతులు పేరిట విద్యార్థులను పాఠశాలకు పిలిచి తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు అలా తరగతులు నిర్వహించి పాఠశాలలును, కళాశాలలును వెంటనే తనిఖీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.