Advertisements

ప్రశాంత వాతావరణంలో ఆంజనేయ జెండా నిర్వహించుకోవాలి

ప్రశాంత వాతావరణంలో ఆంజనేయ జెండా నిర్వహించుకోవాలి
-320 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు
-ప్రధాన జెండాలు ముందస్తుగా జరుపుకోవాలి
-జెండా ఊరేగింపులో బాణాసంచా నిషేధం
-గూడూరు డిఎస్పి

భారతదేశంలోనే అత్యధిక పేరొందిన ఆంజనేయ జెండా ఉత్సవం గూడూరులో నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా నిర్వాహకులు నిర్వహించుకోవాలని గూడూరు డిఎస్పి వివి రమణ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గూడూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశాన్ని డిఎస్పి నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీసు నిబంధనలకు లోబడి జెండా ఊరేగింపులు నిర్వహించుకోవాలని తెలిపారు.ప్రధానంగా పట్టణంలో ప్రాముఖ్యత పొందిన ప్రాంతాల్లో నిర్వహించే జెండాలు ముందస్తుగా నిర్వహించుకునే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రతి జండా జరిగే ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఉంటుందని గూడూరు ఒకటో రెండో పట్టణంలో మొత్తం 320 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పి తెలిపారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే అదుపులో తీసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. జండా ఊరేగింపులు ఎక్కడ కూడా బాణాసంచాలు కాల్చకూడదని నిషేధిస్తూ ఉత్తర్వులు ఉన్నాయని వాటి తప్పనిసరిగా నిర్వాహకులు పాటించాలన్నారు.అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా పోలీసులకు సహకరించి జెండా పండుగ నిర్వహించుకోవాలన్నారు. ఒకటో పట్టణం సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ముఖ్యంగా కరణాల వీధి, తూర్పు వీధి, గమల్లపాలెం, మిట్టపాలెం జెండాల నిర్వాహకులు ఆలస్యం చేయకుండా ముందస్తుగా బయలుదేరితే మిగిలిన జెండాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. మసీదులు, చర్చిల వద్ద డీజే సౌండ్ తగ్గించి మతవిద్వేషాలకు తావివ్వకుండా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమావేశంలో రెండో పట్టణ సీఐ  శ్రీనివాసరావు శ్రీనివాసరావు, ఒకటో పట్టణ ఎస్సై తిరుమల రావు, రెండో పట్టణ ఎస్సై గోపాల్, ఆంజనేయ జెండా ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.


.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This