గూడూరు పట్టణంలో అన్నా క్యాంటిన్ ను
శాసన సభ్యుల దంపతులు పాశిం సునీల్ కుమార్ శ్రీమతి సంధ్యారాణి చేతులు మీద గా
పునః ప్రారంభించారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ తల్లి తండ్రి జ్జ్ఞాపకార్ధం వారి గుర్తుగా ఈ రోజు మొదటిగా అన్నా క్యాంటిన్ నందు పేదలకు అన్నధానం చేయడం మా అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు.
పేదలకు పట్టేడన్నం కోసం అన్నా నందమూరి తారక రామారావు జ్ఞాపకార్ధం నారా చంద్రబాబు నాయుడు 5 రూపాయలకే అన్నం పథకానికి శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే గతంలో ఇక్కడ అన్నా క్యాంటిన్ నిర్మించామని తెల్పారు
కానీ గత ప్రభుత్వం ఆ క్యాంటిన్ మూసివేసి వేరే వాటి కోసం వాడబడిందని,కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు అన్నం అందించాలనే మా నాయకుని సంకల్పం తో మరల తిరిగి ఇక్కడ అన్నా క్యాంటిన్ను పునఃప్రారభించాముఅన్నారు.ఎన్నో పనుల నిమ్మితం పేదలు పట్టణం కొస్తారు వారందరికీ 5 రూపాయలకే మంచి భోజనం ఈ రోజుటి నుండి అందించడం చాలా సంతోషం గా ఉందని అన్నారు.అన్న క్యాటీన్ ప్రారంభం కావడంతో పట్టణంలో ప్రజలు సంతోషం వ్యక్థ పరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.