ప్రతి సభ్యుడు కేవైసీ నమోదు చేసుకోవాలి
-సహకార సంఘాలన్నింటికీ తల మానికం గూడూరు పిఎసిఎస్
-డివిజనల్ సహాయ సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్
వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలు అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఆత్మ నిర్వర్ పథకం లో భాగంగా కంప్యూటరీ కరణ చేస్తున్నారని తప్పనిసరిగా సభ్యులు కేవైసీ నమోదు చేసుకోవాలని డివిజనల్ సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు నం 24 పిఎసిఎస్ కార్యాలయ ఆవరణంలో మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజనల్ సహకార శాఖాధికారి రవి రాజశేఖర్ మాట్లాడుతూ గూడూరు నం 24 పిఎసిఎస్ డివిజన్ కే తల మాలికమని అన్ని సొసైటీలలో మణిపూసలాంటిదని ఆయన పేర్కొన్నారు.ఆన్లైన్ విధానాన్ని పటిష్టంగా పూర్తి చేసి త్వరితగతిన సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు కేవైసీ డీటెయిల్స్ అందించాలన్నారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత,సేవలు మెరుగుపరుచుకునే అవకాశం ఉందన్నారు. పి ఎస్ సి ఎస్ ల బలోపేతానికి ప్రతి సభ్యులు కృషి చేసిసంఘానికి బాధ్యత గా సేవలు అందించాలన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సభ్యుడు ఈ కేవైసీ నమోదు చేసుకొని సద్వినియోగపరచుకోవాలన్నారు. గూడూరు నెంబర్ 24 పి ఎస్ సి ఎస్ పర్సన్ ఇంచార్జ్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నంబర్ 24 పిఎసిఎస్ లాభాల బాటలో ఉందన్నారు. సంఘానికి కోటి 30 లక్షల రూపాయలు ఆదాయంతో 29 కోట్లు రుణాలు లావాదేవీలు జరగక 9 కోటి రూపాయలు కాలేదు అన్నారు. వాయిదా మీరు రుణాలు సకాలంలో సిబ్బంది వసూలు చేసి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలన్నారు. గూడూరు పి ఎస్ సి ఎస్ లో 5394 మంది సభ్యులు ఉండగా 2117మంది మాత్రమే కేవైసీ డీటెయిల్స్ ఇచ్చారని మిగిలిన 3 2 23 మంది త్వరితగతిన కేవైసీ వివరాలను అందించి నమోదు చేయించుకోవాలన్నారు. లేనిపక్షంలో సభ్యత్వాలు రద్దవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డిసిసిబి మేనేజర్ సత్యవతి, గూడూరు తిప్పకుంటపాలెం సీ ఈ ఓలు నారాయణ,తిపగుంట పాలెం సీ ఈ ఓ రామయ్య, గూడూరు పట్టణ, మండల టిడిపి అధ్యక్షులు పులిమీ శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, పి ఎస్ సి ఎస్ మాజీ ఉపాధ్యక్షులు డేగపూడి కృష్ణారెడ్డి, మాజీ డైరెక్టర్ ఇందుకూరు జనార్దన్ రెడ్డి, రైతులు, గూడూరు నెం ,24 పి ఎస్ సి ఎస్ సిబ్బంది నారాయణరెడ్డి, రాజా, తదితరులు పాల్గొన్నారు.