గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన మల్లి శ్రావణి తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు చదివేందుకు స్తోమత లేక పోవడంతో అర్థాంతరంగా చదువు మానేసింది.టిడిపి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి చొరవతో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మల్లి శ్రావణి కుటుంబాన్ని పరామర్శించి తాను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యూ కళాశాలలో ఎం సి ఎ చదువుతున్న శ్రావణికి కళాశాల ఫీజు 25 వేలు₹రూపాయాలను బుధవారం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి చేతుల మీదుగా చెన్నూరు లోని విద్యార్థిని శ్రావణికి అందించారు.ఈ సందర్భంగా శ్రావణి రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజక వర్గంలో పేద ప్రజలకు అండగా మన ఎమ్మెల్యే సునీలన్న అందుబాటులో ఉంటూ సేవే లక్ష్యంగా పని చేస్తారన్నారు.