నాలో నేను రథసారధి (ఎన్ .ఎన్ .ఆర్ ) వెల్ఫేర్ అసోసియేషన్ ట్రావెల్స్ వ్యవస్థాపకులు నీరుగట్టు వెంకటరమణ మరియు కార్యవర్గం తిరుపతి మున్సిపల్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ గణపతి పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు వినాయక చవితి వేడుకలు భాగంగా ట్రావెల్స్ యాజమాన్యాలు మరియు డ్రైవర్స్ కలిసి సంయుక్తంగా వినాయక చవితి పండుగ చేసుకోవడం ఐక్యతకు చిహ్నం అని కొనియాడారు. డ్రైవర్స్ కు అలాగే వాహన యజమానులకు ఎదురయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.