Advertisements

సబ్ కలెక్టర్ గా గూడూర్ డివిజన్లోని ప్రజలందరూ సహకారంతో పారదర్శకంగా విధులు నిర్వహిస్తా

గూడూరు సబ్ కలెక్టర్ గా రాఘవేంద్ర మీనా
స్వాగతం పలికిన ఆర్డీవో కిరణ్ కుమార్

సబ్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది

గూడూరు సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ కేడర్ కు చెందిన రాఘవేంద్ర మీనా శనివారం వేద పండితుల మంత్రోచణాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన ఆర్టీవో కిరణ్ కుమార్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించారు. ముందుగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం గూడూరు డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దారులు, రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చాలు, బొకేలు,శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విలేకరులతో మాట్లాడుతూ గూడూరు డివిజన్లోని ప్రజలందరకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా ఆయన మాట్లాడుతూ తాను 2022 సంవత్సరంలో ఐఏఎస్ కు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని శ్రీకాకుళం జిల్లాలో శిక్షణా కలెక్టర్ గా పని చేశారని గూడూరు సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ తో ప్రభుత్వ నియమించింది అన్నారు. సబ్ కలెక్టర్ గా గూడూర్ డివిజన్లోని ప్రజలందరూ సహకారంతో పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా తన సిబ్బంది ద్వారా కృషి చేస్తానన్నారు.

Leave a Comment