బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ
హర్ ఘార్ తీరంగా భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి : బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్
భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలతో తిరంగా ర్యాలీ
భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక గూడూరు రెండో పట్నంలోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాల నుండి కోర్టు సెంటర్ వద్ద వరకు తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఇంటి మీద జెండా ఎగురవేయాలని, ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాలని రాబోతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించామని ఆయన అన్నారు మరియు బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారు చేసినటువంటి దేశ సేవను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గాలి ప్రకాష్ నాయుడు గారు మరియు స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ నిరంజన్ రెడ్డి గారు మరియు స్వర్ణాంధ్ర భారతి పాఠశాల కరస్పాండెంట్ నవకోటేశ్వరరావు గారు ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు