నిరుపేదలకు అండగా ఎం ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్
ప్రతి ఆదివారం అన్నదానం నేటితో 22వ వారం..
ఫోటో రైటప్: నిరుపేద నిరాశ్రయులకు భోజన ప్యాకెట్లను అందిస్తున్న ట్రస్ట్ సభ్యులు..
నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి, బారా షహిద్ దర్గా మరియు తిక్కన భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద నిరాశ్రయులకు 50 మందికి భోజన పొట్లాలను మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు మొహమ్మద్ సర్తాజుద్దీన్, మొహమ్మద్ అమృద్దీన్ లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గత 21 వారాల నుండి నెల్లూరు లోని పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి వారికి ప్రతి ఆదివారం ఒక్క పూట రుచికరమైన భోజనాన్ని అందిస్తూ వస్తున్నామని నేటితో 22 వ వారం అని అన్నారు ఇక ముందు కూడా మా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తూ ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ సర్తాజుద్దీన్, మొహమ్మద్ అమృద్దీన్, మొహమ్మద్ షరీనా లు పాల్గొన్నారు.