జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో జరిగే తల్లి తండ్రుల కమిటీ ఎన్నికలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూడండి..కిరణ్ కుమార్ రెడ్డి ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం 2009 లో భాగంగా తల్లి, తండ్రుల కమిటీల నియామక ఏర్పాటును అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొనివచ్చి, విద్యా వ్యవస్థలో జవాబుదారీ తనాన్ని, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను తల్లి తండ్రులకు అప్పగించారు.రేపు అనగా 08-08-24న ప్రభుత్వ పాఠశాలలో జరిగే తల్లి తండ్రుల కమిటీ ఎన్నికలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిర్వహించేలా ఆదేశించమని జిల్లా విద్యాశాఖాధికారి గారిని విన్నవించడం జరిగింది.కొన్ని చోట్ల అధికార పార్టీ కార్యకర్తల మరియు సానుభూతి పరులను విద్యాకమిటి చైర్మన్ లు గా నియమించేలా టీచర్ల మీద, అదేవిధంగా తల్లి తండ్రుల మీద అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తీసుకురావడం విద్యా వ్యవస్థలో సిగ్గుచేటు.అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినంతగా టీచర్లు లేరు, దాని వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని తెలియజేయడం జరిగింది.గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన జి ఓ నెం 117ను రద్దుచేసి పాత ప్రైమరీ స్కూల్ విధానం తీసుకొచ్చేదానికన్నా కూడా దగ్గర్లో ఒకే మేజర్ పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి ప్రాథమిక పాఠశాలలో చాలా చోట్ల కేవలం విద్యార్థుల సంఖ్య 10లోపు ఉండేటటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి, కనుక వాటిని అన్ని కలిపి, అందులోని విద్యార్థులకు రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ఒకే చోట కాంప్లెక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే దగ్గర సరిపడా టీచర్లతో అన్ని వసతులతో పాఠశాల కాంప్లెక్స్ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని తెలియజేయడం జరిగింది.అన్నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PED టీచర్లను నియమించి, విద్యార్థులను క్రీడల లో రాణించే విధంగా ఏర్పాట్లు చేయమని కోరడం జరిగింది.
ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా తల్లికి వందనం అనే పేరుతో తల్లిదండ్రులకు చదువుకునే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాం అనే హామీని ఈ విద్యా సంవత్సరంలోనే, కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఖచ్చితంగా మంజూరు చేయాలని కోరడం జరిగింది.
అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో పాటుగా, తెలుగు మీడియం కూడా ప్రోత్సహిస్తూ విద్యార్థులకు నచ్చిన మీడియం లో చదువుకునే విధంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటులో భాగంగా అసంపూర్తిగా ఉన్నటువంటి నాడు- నేడు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యవంతంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని కోరడం జరిగింది.నెల్లూరు నగరంలోని 18వ డివిజన్లో దాదాపు 5వేల పేద కుటుంబాలు ఉంటే గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మూసి వేయడం జరిగింది, ఆ పాఠశాలను తిరిగి పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిరివెళ్ళ నరేష్, స్వర్ణ రాజశేఖర్, NSUI జిల్లా అధ్యక్షులు యామల రాజా, సాయికృష్ణ హమీద్ లు పాల్గొనడం జరిగింది.